గృహ రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేకపోతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోన్న వైనం
- క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ నివేదికలో వెల్లడి
- 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరు నాటి వివరాలు
- చెల్లింపుల వైఫల్యాల రేటు 2.49 శాతం
- రూ.10 లక్షలలోపు రుణాలు తీసుకున్న వారి డిఫాల్ట్ రేటే అత్యధికం
భారత్‌లో గృహ రుణాలు తీసుకుని డబ్బు చెల్లించలేకపోతోన్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది. కరోనా విపత్కర పరిస్థితులు, ఉద్యోగాలు కోల్పోతుండడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం వంటి పరిణామాలతో చాలా మందికి ఇళ్లు గడవడమే కష్టంగా మారడంతో చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలో, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హై మార్క్ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం... 2020-21 ఆర్థిక సంవత్సరం డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికానికి గృహ రుణాలు తీసుకున్న వారి చెల్లింపుల వైఫల్యాల రేటు 0.23 శాతం పెరిగి, 2.49 శాతానికి చేరుకుంది.
అలాగే, బ్యాంకుల నుంచి గృహాల కొనుగోళ్లు, నిర్మాణాల కోసం రూ.75 లక్షలు, అంతకు మించి గృహ రుణాలు తీసుకుని చెల్లించలేకపోయిన వారి విషయానికి వస్తే గత ఏడాది డిసెంబరు నాటికి చెల్లింపుల వైఫల్యాల రేటు 3.01 శాతానికి ఎగబాకింది.
రూ.35 లక్షల నుంచి 75 లక్షల రూపాయల మధ్య రుణాలు తీసుకుని తిరిగి చెల్లింపుల్లో వైఫల్యాల రేటు 1.9 శాతంగా ఉంది. రూ.35 లక్షల లోపు రుణాల తిరిగి చెల్లింపుల వైఫల్యాల రేటు 2.56 శాతానికి పెరిగింది. రూ.10 లక్షల లోపు రుణాలు తీసుకున్న వారి డిఫాల్ట్ రేటే అత్యధికంగా 4.44 శాతంగా ఉంది.
25 ఏళ్లలోపు వయసు ఉండి గృహ రుణాలు తీసుకుని తిరిగి చెల్లించని వారి రేటు 4.24 శాతం నమోదవగా, 45 నుంచి 55 ఏళ్ల విభాగంలో అతి తక్కువగా 2.21 శాతంగా ఉంది. దేశంలో బ్యాంక్‌ల నుంచి రుణాలు తీసుకున్న వారితో పోల్చితే, హోమ్ ఫైనాన్స్ కంపెనీలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల గృహ రుణాల్లోనే డిఫాల్ట్‌లు అధికంగా ఉన్నాయి. ముంబై, ఢిల్లీలో ఇటువంటివి నమోదవుతున్నాయి.
మరోవైపు, గృహ రుణాలు తీసుకుంటోన్న వారి సంఖ్య పెరిగిపోతోంది. 2020 డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో హోం లోన్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 9.6 శాతం వృద్ధిని సాధించింది. నికర బకాయిల విలువ రూ.22.26 లక్షల కోట్లకు చేరింది. 2019 డిసెంబరు నాటికి ఇది రూ.20.31 లక్షల కోట్లుగా ఉండేది.
కాగా, గత ఏడాది ఆర్థిక సంవత్సరంలో మార్చి నుంచి డిసెంబరు మధ్యకాలంలో గృహ రుణాలు తీసుకున్న వారిలో 36 ఏళ్లలోపు వారు 27 శాతంగా ఉన్నారు. గృహ రుణాల కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల వైపునకే ప్రజలు మొగ్గుచూపుతున్నారు. దాని వాటానే 45 శాతంగా ఉంది.