'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ విషయంలో వచ్చేసిన క్లారిటీ!
- కరోనా కారణంగా ఆగిపోయిన షూటింగ్
- విడుదల వాయిదా పడనున్నట్టు ప్రచారం
- అక్టోబర్ 13నే రానుందంటూ స్పష్టత
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ .. చరణ్ కథానాయకులుగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. కొమరం భీమ్ గా ఎన్టీఆర్ .. అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తున్నారు. ఈ రెండూ కూడా పవర్ఫుల్ పాత్రలు కావడంతో, ఇద్దరు హీరోల అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో, వివిధ భాషలకి చెందిన స్టార్లు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13వ తేదీన విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు.
అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా కొంత చిత్రీకరణ మిగిలి ఉంది. కరోనా కారణంగా షూటింగు ఆగిపోయింది. కరోనా ప్రభావం తగ్గితేనేగాని షూటింగు చేసే పరిస్థితి లేదు. అందువలన ఈ సినిమా విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ, ముందుగా చెప్పిన రోజునే ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పాడు. నిన్న విడుదల చేసిన ఎన్టీఆర్ పోస్టర్ పై కూడా అక్టోబర్ 13 అనే ఉంది కనుక, అదే రోజున ఈ సినిమా రానుందనే విషయం ఖరారైపోయింది.