టాలీవుడ్‌లో మరో విషాదం.. సినిమాటోగ్రాఫర్ జయరామ్‌ను బలితీసుకున్న కరోనా

  • చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన జయరామ్
  • జయరామ్ స్వస్థలం వరంగల్
  • ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ వంటి గొప్ప నటులతో కలిసి పనిచేసిన కెమెరామన్  
  • మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి వంటి వారితో మలయాళంలో పనిచేసిన వైనం
  • ఎన్టీఆర్ చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’కు ఆయనే సినిమాటోగ్రాఫర్
కరోనా వైరస్ తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదాన్ని నింపింది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వి. జయరామ్‌ను బలితీసుకుంది. ఇటీవల కరోనా బారినపడి ఆయన చికిత్స పొందుతూ గత రాత్రి కన్నుమూశారు. నందమూరి తారకరామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు వంటి వారితో తెలుగులోను, మమ్ముట్టి, మోహన్‌లాల్, సురేశ్ గోపి లాంటి హీరోలతో మలయాళంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో కలిసి ఎన్నో సినిమాలకు జయరామ్ పనిచేశారు. జయరామ్‌కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.  జయరామ్ స్వస్థలం వరంగల్. ఎన్టీఆర్‌ను ఎంతగానో అభిమానించే జయరామ్ ఆయన చివరి చిత్రమైన 'మేజర్ చంద్రకాంత్‌'కు సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. ఆంధ్రాక్లబ్‌లో క్యాషియర్ స్థాయి నుంచి అసిస్టెంట్ కెమెరామన్‌గా ఎదిగి చివరికి సినిమాటోగ్రాఫర్‌గా జయరామ్ స్థిరపడ్డారు.


More Telugu News