సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

  • 'బంగార్రాజు'లో పాయల్ స్పెషల్ సాంగ్
  • కేస్టింగ్ ఎంపిక పనిలో హరీశ్ శంకర్
  • 27న ఓటీటీలో 'ఏక్ మినీ కథ'  
*  అందాల కథానాయిక పాయల్ రాజ్ పుత్ త్వరలో ఓ స్పెషల్ సాంగులో నటించనుంది. నాగార్జున హీరోగా కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందే 'బంగార్రాజు' చిత్రంలో స్పెషల్ సాంగ్ కోసం పాయల్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.  
*  'గబ్బర్ సింగ్' సినిమా తర్వాత మళ్లీ పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన స్క్రిప్టును కూడా దర్శకుడు హరీశ్ తాజాగా పూర్తి చేసినట్టు, ప్రస్తుతం కేస్టింగ్ ను ఎంపిక చేస్తున్నట్టు సమాచారం.
*  సంతోష్ శోభన్, కావ్య థాపర్ హీరో హీరోయిన్లుగా కార్తీక్ రాపోలు దర్శకత్వంలో రూపొందిన 'ఏక్ మినీ కథ' చిత్రం డైరెక్టుగా ఓటీటీ ద్వారా విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని ఈ నెల 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.


More Telugu News