నేడు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిని సందర్శించనున్న కేసీఆర్
- ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు
- 11.45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలు సందర్శన
- 2 గంటలకు ఎంజీఎంకు
- అనంతరం అధికారులు, మంత్రులతో సమీక్ష సమావేశం
- 4 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు
ఇటీవల గాంధీ ఆసుపత్రిని సందర్శించి కరోనా రోగులతో ముచ్చటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు వరంగల్ ఎంజీఎంను సందర్శించనున్నారు. ఉదయం 11 గంటలకు హెలికాప్టర్‌లో హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళ్తారు. అనంతరం 11.45 గంటలకు వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించి దానిని ఆసుపత్రిగా మార్చేందుకు తగిన ఆదేశాలు ఇస్తారు.
మధ్యాహ్న భోజనం అనంతరం 2 గంటలకు ఎంజీఎంను సందర్శించి ఆసుపత్రిలోని సౌకర్యాలను పరిశీలిస్తారు. రోగులతో మాట్లాడతారు. ఆ తర్వాత మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, జిల్లా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, పోలీస్ కమిషనర్, వైద్యాధికారులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితరులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, నేడు ప్రపంచ సాంస్కృతిక దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.