తెలంగాణలో కొత్తగా 3,660 కొవిడ్ పాజిటివ్ కేసుల నమోదు
- గడచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 574 మందికి పాజిటివ్
- రాష్ట్రంలో 4,826 మందికి కరోనా నయం
- 23 మంది మృతి.. ఇంకా 45,757 మందికి చికిత్స
తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 69,252 కరోనా పరీక్షలు నిర్వహించగా... 3,660 కొత్త కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 574 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రంగారెడ్డి జిల్లాలో 247, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 217 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,826 మంది కరోనా నుంచి కోలుకోగా, 23 మంది మరణించారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 5,44,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,95,446 మంది కోలుకున్నారు. ఇంకా 45,757 మందికి ఐసోలేషన్ లోనూ, ఆసుపత్రుల్లోనూ చికిత్స కొనసాగుతోంది. మొత్తం మరణాల సంఖ్య 3,060కి చేరింది. తెలంగాణలో కోలుకుంటున్న వారి శాతం 91.03కి పెరిగింది.
.