మరో రెండు, మూడు రోజుల్లో మార్కెట్లోకి 'ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్స్'
- ఎవరికి వారే కరోనా పరీక్షలు
- ఐసీఎంఆర్ అనుమతి
- ఒక్కో కిట్ ధర రూ.250
- జూన్ నెలాఖరుకు 45 లక్షల టెస్టులు లక్ష్యం
- నిన్న ఒక్కరోజే దేశంలో 20 లక్షల టెస్టులు
ఇక ఇంటి వద్దనే ఎవరికి వారే కరోనా టెస్టులు చేసుకునేందుకు ఉపకరించే సరికొత్త కొవిడ్ టెస్టింగ్ కిట్లు రంగప్రవేశం చేస్తున్నాయి. వీటిని ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లుగా పిలుస్తారు. ఈ ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్లు మరో రెండు, మూడు రోజుల్లో మార్కెట్లోకి రానున్నాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ్ వెల్లడించారు. ఈ కిట్లకు ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. ఒక ఎట్-హోం కొవిడ్ టెస్టింగ్ కిట్ ధర రూ.250 అని వెల్లడించారు.
ఈ నెలాఖరుకు 25 లక్షల కరోనా పరీక్షలు, జూన్ నెలాఖరుకు 45 లక్షల పరీక్షలు చేయాలన్నది తమ లక్ష్యం అని పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 20 లక్షల కొవిడ్ టెస్టులు నిర్వహించామని బలరామ్ భార్గవ్ వెల్లడించారు.