బ్లాక్ ఫంగస్ కంటే.. వైట్ ఫంగస్ ఇంకా డేంజరస్ అంటున్న వైద్యులు!
- కొత్తగా వెలుగుచూస్తున్న వైట్ ఫంగస్ కేసులు
- బీహార్ లో నలుగురికి వైట్ ఫంగస్
- యాంటీ ఫంగల్ ఔషధాలతో కొలుకున్న రోగులు
ఓ పక్క కరోనా వైరస్ పంజా విసురుతుంటే... ఇదే సమయంలో బ్లాక్ ఫంగస్ నెమ్మదిగా అన్ని రాష్ట్రాలకు పాకుతూ జనాలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఇప్పటికే మన దేశంలో రెండు, మూడు రాష్ట్రాలు ఈ ఫంగస్ ను మహ్మమారిగా ప్రకటించాయంటే దీని తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే, తాజాగా వైట్ ఫంగస్ వెలుగులోకి వచ్చింది. బీహార్ లోని పాట్నాలో నలుగురికి వైట్ ఫంగస్ వ్యాధి నిర్ధారణ అయింది. వీరికి కరోనా టెస్టుల్లో నెగెటివ్ రిపోర్టులు వచ్చినప్పటికీ... వీరికి వైట్ ఫంగస్ సోకినట్టు స్పష్టమైంది. అయితే, వీరికి యాంటీ ఫంగల్ ఔషధాలను ఇవ్వడంతో ఆ వ్యాధి నుంచి కోలుకున్నారు.
వైట్ ఫంగస్ గురించి వైద్యులు చెపుతున్న దాని ప్రకారం వైట్ ఫంగస్ కన్నా బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకారి. వైట్ ఫంగస్ సోకినవారిలో వారి ఊపిరితిత్తులు, చర్మం, గోళ్లు, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మావయవాలు, నోరు ప్రభావితమవుతాయి. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. హెచ్ఆర్సీటీ ద్వారా ఈ ఫంగస్ ను గుర్తించవచ్చు. ఎక్కువ కాలం స్టెరాయిడ్లు తీసుకునేవారికి, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి, డయాబెటిస్ బాధితులకు ఈ వైట్ ఫంగస్ ఎక్కువగా సోకే అవకాశం ఉంది.