డిసెంబర్ నాటికి ప్రజలందరికీ అందుబాటులోకి వ్యాక్సిన్లు: జేపీ నడ్డా
- రెండో దశ వ్యాప్తి గురించి మోదీ ముందే హెచ్చరించారు
- కాంగ్రెస్ పార్టీ అరాచక వాదాన్ని వ్యాప్తి చేస్తోంది
- ఆక్సిజన్, ఔషధాల సరఫరాకు కేంద్రం కట్టుబడి వుంది
దేశంలో కరోనా ఊహించని స్థాయిలో పెరిగిపోవడం, ఔషధాలు, వ్యాక్సిన్ల కొరత నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు వస్తుండడంతో దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్పందించారు. డిసెంబరు నాటికి ప్రజలందరికీ వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.
దేశంలో కరోనా రెండో దశ వ్యాప్తి గురించి ముఖ్యమంత్రులను ప్రధాని మోదీ ముందే హెచ్చరించారని జేపీ నడ్డా తెలిపారు. కరోనా వేళ కాంగ్రెస్ పార్టీ అరాచక వాదాన్ని వ్యాప్తి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాలకు ఆక్సిజన్, కరోనా ఔషధాల సరఫరాకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పుకొచ్చారు.