మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు?: జగన్ ను నిలదీసిన నారా లోకేశ్
- మాస్క్ ధరించడం తప్పనిసరి అని కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చారు
- ముఖ్యమంత్రే మాస్కు పెట్టుకోకపోతే ఇతరులు ఎలా పెట్టుకుంటారు?
- కొవిడ్ వైరస్ చిన్నపాటి జ్వరం లాంటిదేనని అన్నారు
- పారాసెటమాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చల్లితే చస్తుంది అన్నారు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ మాస్కు పెట్టుకోవట్లేదని తెలుపుతూ ఓ ఫొటోను పోస్ట్ చేశారు. 'ముఖ్యమంత్రి గారూ! మాస్క్ ధరించడం తప్పనిసరి అని మీ ఫొటో, పేరుతో కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చిన మీరు మాస్క్ ధరించకుండా ప్రజలకు ఏం సంకేతాలిస్తున్నారు? ముఖ్యమంత్రే మూర్ఖంగా మాస్క్ పెట్టుకోకపోతే, ఇక మంత్రులూ, ఎమ్మెల్యేలూ మాస్కులెందుకు ధరిస్తారు?' అని లోకేశ్ ప్రశ్నించారు.
'తొలి విడతలో కొవిడ్ వైరస్ చిన్నపాటి జ్వరం లాంటిదేనని, పారాసెటమాల్ వేస్తే పోద్ది, బ్లీచింగ్ చల్లితే చస్తుంది.. ఇట్ కమ్స్ ఇట్ గోస్.. ఇట్ షుడ్‌బీ నిరంతర ప్రక్రియ, సహజీవనం అంటూ ఫేక్ మాటలతో వేలాది మందిని బలిచ్చారు' అని లోకేశ్ విమర్శించారు.
'సెకండ్‌వేవ్‌లో రాష్ట్రం శ్మశానంగా మారుతుంటే చిరునవ్వులు చిందిస్తూ, మీరే మాస్క్ ధరించకుండా ఇంకెన్ని వేలమంది ప్రాణాలు పణంగా పెడతారు? మాస్క్ లేకుండా మూర్ఖుడిగా ఉంటారో, మాస్క్ వేసుకుని మనిషినని నిరూపించుకుంటారో మీ ఇష్టం' అని లోకేశ్ ట్వీట్ చేశారు.