రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ముఖ్యాంశాలు - 4

  • రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ. 2,29,779.27 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 1,82,196 కోట్లు
  • రెవెన్యూ లోటు రూ. 5 వేల కోట్లు
ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. ఈ బడ్జెట్ లో నవరత్నాలకే ప్రభుత్వం పెద్దపీటను వేసింది.  

బడ్జెట్ వివరాలు:

  • 2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా - రూ. 2,29,779.27 కోట్లు
  • రెవెన్యూ వ్యయం - రూ. 1,82,196 కోట్లు
  • మూలధన వ్యయం - రూ. 47,582 కోట్లు
  • రెవెన్యూ లోటు - రూ. 5 వేల కోట్లు (0.47 శాతం)
  • ద్రవ్య లోటు - రూ. 37,029.79 కోట్లు
  • జీఎస్డీపీలో ద్రవ్యలోటు - రూ. 3.49 శాతం  
  • నీటిపారుదల శాఖకు - రూ. 13,237.78 కోట్లు
అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రసంగాన్ని ఆర్థిక మంత్రి బుగ్గన ముగించారు. వెంటనే వ్యవసాయ మంత్రి కన్నబాబు వ్యవసాయశాఖ బడ్జెట్ ను ప్రారంభించారు.


More Telugu News