రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ముఖ్యాంశాలు - 2
- రైతు పథకాలకు రూ. 11,210.80 కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితుల చెల్లింపు కోసం రూ. 200 కోట్లు
- ఉన్నత విద్యకు రూ. 1,973 కోట్లు
ఏపీ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికమంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల బడ్జెట్ తో ఆయన బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో నవరత్నాలకే ప్రభుత్వం పెద్దపీటను వేసింది.
బడ్జెట్ వివరాలు:
బడ్జెట్ వివరాలు:
- రైతు కాపు నేస్తం - రూ. 500 కోట్లు
- వైయస్సార్ వాహనమిత్ర - రూ. 285 కోట్లు
- వైయస్సార్ జగనన్న చేదోడు పథకం - రూ. 300 కోట్లు
- అగ్రిగోల్డ్ బాధితుల చెల్లింపు కోసం - రూ. 200 కోట్లు
- వైయస్సార్ మత్స్య భరోసా - రూ. 120 కోట్లు
- వైయస్సార్ నేతన్న నేస్తం - రూ. 190 కోట్లు
- మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం - రూ. 50 కోట్లు
- ఈబీసీ నేస్తం - రూ. 500 కోట్లు
- లా నేస్తం కోసం - రూ. 16.64 కోట్లు
- అమ్మఒడి పథకం - రూ. 6,107 కోట్లు
- వైయస్సార్ చేయూత - రూ. 4,455 కోట్లు
- రైతు పథకాలకు - రూ. 11,210.80 కోట్లు
- వైయస్సార్ ఆసరా - రూ. 6,337 కోట్లు
- స్కూళ్లలో నాడు - నేడు కార్యక్రమానికి - రూ. 3, 500 కోట్లు
- జగనన్న విద్యాకానుక - రూ. 750 కోట్లు
- ఉన్నత విద్యకు - రూ. 1,973 కోట్లు
- జగనన్న గోరుముద్ద పథకం - 1,200 కోట్లు
- వైయస్సార్ పశువుల నష్టపరిహారానికి - రూ. 50 కోట్లు
- వ్యవసాయరంగంలో యాంత్రికీకరణకు - రూ. 739.46 కోట్లు
- వైయస్సార్ ఉచిత పంటల బీమాకు - రూ. 1,802.82 కోట్లు
- వైయస్సార్ టెస్టింగ్ ల్యాబ్ లకు - రూ. 85.57 కోట్లు.