ఇగో, పట్టుదలలకు పోకుండా అహంవీడి వీటి గురించి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు: వర్ల రామయ్య
- రాష్ట్రంలో ఓ పక్క కరోనా విలయ తాండవం
- మరో పక్క బ్లాక్ ఫంగస్ విజృంభణ
- ఇంకోపక్క పేదవాని ఆకలి కేకలు
- మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరవండి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇగోలను పక్కనబెట్టి ప్రజల గురించి పట్టించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆయన సూచిస్తూ ట్వీట్ చేశారు.
'ముఖ్యమంత్రి గారు, రాష్ట్రంలో ఓ పక్క కరోనా విలయ తాండవం, మరో పక్క బ్లాక్ ఫంగస్ విజృంభణ, ఇంకో పక్క, పేదవాని ఆకలి కేకలు. రోజువారీ కూలీల అవస్థలు. వాస్తవిక పరిస్థితులు గమనించి, "ఇగో" కు , పట్టుదలలకు పోకుండా, మూసివేసిన అన్న క్యాంటీన్లు తెరవండి. అహంవీడి, పేదవాని క్షుద్బాధ తీర్చండి' అని వర్ల రామయ్య పేర్కొన్నారు.