'అఖండ'కి సంక్రాంతి సెంటిమెంట్?
- హిట్ కాంబినేషన్లో 'అఖండ'
- కరోనా కారణంగా ఆగిన షూటింగు
- దసరా రిలీజ్ పై ఒక ఆశ
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి దర్శకత్వంలో 'అఖండ' రూపొందుతోంది. ద్వారకా క్రియేషన్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ షేడ్స్ తో కనిపించనున్నారు. ఆయన లుక్స్ చూసిన దగ్గర నుంచి, ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగుకి అవాంతరాలు కలుగుతూ ఉండటంతో, షూటింగును పూర్తి చేయలేకపోయారు.
ఇప్పుడు కూడా ఈ సినిమా కరోనా కారణంగానే వాయిదా పడింది. ఇంకా కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించవలసి ఉంది. కరోనా ప్రభావం తగ్గిన తరువాతగానీ, సెట్స్ పైకి వెళ్లే పరిస్థితి లేదు. ఆ తరువాత మళ్లీ షూటింగును మొదలుపెట్టాలి .. మిగతా పనులను పూర్తిచేయాలి. అంతా స్పీడ్ గా జరిగితే దసరాకి విడుదల చేయవచ్చని భావిస్తున్నారట. కాస్త అటు ఇటైతే 'సంక్రాంతి' బరిలోకి దింపాలని చూస్తున్నారట. బాలకృష్ణకి సంక్రాంతికి సెంటిమెంట్ ఉంది. అందువలన ఈ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలే ఎక్కువనే టాక్ బలంగా వినిపిస్తోంది.