రూ. 2.30 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ముఖ్యాంశాలు - 1

  • బీసీ సబ్ ప్లాన్ కు రూ. 28,237 కోట్లు
  • మహిళా అభివృద్ధికి రూ. 47,283 కోట్లు
  • విద్యాపథకాలకు రూ. 24,624 కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపిస్తున్నారు. దాదాపు రూ. 2.30 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. మరోవైపు, ఈ బడ్జెట్ సమావేశాలను టీడీపీ బహిష్కరించడంతో... కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే అసెంబ్లీలో ఉన్నారు.

బడ్జెట్ వివరాలు:

  • బడ్జెట్ అంచనా - రూ. 2,29,779.27 కోట్లు
  • బీసీ సబ్ ప్లాన్ కు - రూ. 28,237 కోట్లు
  • ఎస్సీ సబ్ ప్లాన్ కు - రూ. 17,403 కోట్లు
  • ఎస్టీ సబ్ ప్లాన్ కు - రూ. 6,131 కోట్లు
  • ఈబీసీ సంక్షేమానికి - రూ. 5,478 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమానికి - రూ. 359 కోట్లు
  • మైనార్టీ యాక్షన్ ప్లాన్ కు - రూ. 1,756 కోట్లు
  • మహిళా అభివృద్ధికి - రూ. 47,283.21 కోట్లు
  • చిన్నారుల కోసం - రూ. 16,748 కోట్లు
  • విద్యా పథకాలకు - రూ. 24,624 కోట్లు
  • వ్యవసాయ పథకాలకు - రూ. 11,210 కోట్లు
  • వైద్యం, ఆరోగ్యానికి - రూ. 13,830 కోట్లు
  • జగనన్న విద్యాదీవెన - రూ. 2,500 కోట్లు
  • జగనన్న వసతి దీవెన - రూ. 2,223.15 కోట్లు
  • వైయస్ఆర్ రైతు భరోసా - రూ. 3,845 కోట్లు
  • వైయస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన - రూ. 1,802 కోట్లు
  • డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ  చెల్లింపులకు - రూ. 865 కోట్లు
  • పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు - రూ. 247 కోట్లు


More Telugu News