ఏపీ డెయిరీ ఆస్తులను అమూల్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- ప్రభుత్వ-అమూల్ ప్రాజెక్టులో భాగంగా లీజు
- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను అమూల్‌కు అప్పగించాలని ఆదేశం
ఏపీ డెయిరీ ఆస్తుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ నిరర్థక ఆస్తులను అమూల్ సంస్థకు నామమాత్రపు లీజు ప్రాతిపదికన అప్పగిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకోసం రూపొందించిన డ్రాఫ్ట్ లీజు ఒప్పందానికి ఇప్పటికే ప్రభుత్వ ఆమోదం లభించింది. ప్రభుత్వ-అమూల్ ప్రాజెక్టులో భాగంగా లీజు ప్రాతిపదికన ఏపీ డెయిరీకి వివిధ జిల్లాల్లో ఉన్న ఆస్తులను అమూల్ సంస్థకు అప్పగించాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలోని పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల పునరుజ్జీవం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.