కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏపీ బ్లాక్ ఫంగస్ రోగులకు కూడా చికిత్స అందించాలి: సోము వీర్రాజు

  • ఏపీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు
  • ఔషధాల కొరత ఉందన్న సోము వీర్రాజు
  • అందుకే హైదరాబాదు వెళుతున్నారని వెల్లడి
  • ఏపీ రోగులను తిప్పిపంపుతున్నారని ఆరోపణ
  • సీఎం జగన్ తెలంగాణ ముఖ్యమంత్రితో మాట్లాడాలంటూ లేఖ
కరోనా రోగుల్లో కొందరు బ్లాక్ ఫంగస్ బారినపడుతున్నారని, ఏపీలో చాలాచోట్ల బ్లాక్ ఫంగస్ కు ఔషధాల కొరత ఉందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు పేర్కొన్నారు. దాంతో చాలామంది మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాదు కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రిలో ప్రత్యేకంగా బ్లాక్ ఫంగస్ వార్డు ఏర్పాటు చేసిందని, అయితే ఈ వార్డులో చికిత్స పొందేందుకు వస్తున్న ఏపీ రోగులను వెనక్కి పంపుతున్నారని ఆరోపించారు. అక్కడి సిబ్బంది తెలంగాణ ప్రభుత్వం చెబితేనే చికిత్స చేస్తామంటున్నారని వివరించారు.

దీనిపై ఏపీ సీఎం జగన్ చర్యలు తీసుకోవాలంటూ సోము వీర్రాజు లేఖ రాశారు. కోఠి ఆసుపత్రిలోని బ్లాక్ ఫంగస్ వార్డులో ఏపీ రోగులకు కూడా చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని, ఆ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ తో మాట్లాడాలని విజ్ఞప్తి చేశారు. తన లేఖ పట్ల సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్టు సోము పేర్కొన్నారు.


More Telugu News