తెలంగాణలో కొత్తగా 3,837 కరోనా కేసులు, 25 మరణాలు

  • గత 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు
  • జీహెచ్ఎంసీ పరిధిలో తగ్గుముఖం పడుతున్న కేసులు
  • తాజాగా 594 మందికి పాజిటివ్
  • రాష్ట్రవ్యాప్తంగా 25 మంది మృతి
  • తెలంగాణలో రికవరీ రేటు 90.75 శాతం
తెలంగాణలో గడచిన 24 గంటల్లో 71,070 కరోనా పరీక్షలు నిర్వహించగా 3,837 మందికి పాజిటివ్ అని వెల్లడైంది. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 594 కొత్త కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 17 కేసులు గుర్తించారు. అదే సమయంలో 4,976 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, 25 మంది మృత్యువాతపడ్డారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 5,40,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 4,90,620 మంది కోలుకున్నారు. ఇంకా 46,946 మందికి కరోనా చికిత్స జరుగుతోంది. అటు, మొత్తం మరణాల సంఖ్య 3,037కి చేరింది.

కాగా, జాతీయస్థాయిలో కరోనా మరణాల రేటు 1.1 శాతం ఉండగా, తెలంగాణలో 0.56 శాతంగా నమోదైంది. దేశంలో రికవరీ రేటు 86.2 శాతం కాగా, తెలంగాణలో 90.75 శాతంగా ఉంది.


More Telugu News