ఏపీలో కరోనా స్వైరవిహారం... మరోసారి 100కి పైగా మరణాలు

  • గత 24 గంటల్లో ఏపీలో 106 మంది మృతి
  • పశ్చిమ గోదావరి జిల్లాలో 17 మంది కన్నుమూత
  • 9,686కి చేరిన మొత్తం మరణాలు
  • తాజాగా ఏపీలో 23,160 మందికి పాజిటివ్
  • తూర్పుగోదావరి జిల్లాలో 3,528 కొత్త కేసులు
ఏపీలో కరోనా మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇటీవల కొన్నిరోజులుగా నిలకడగా 20 వేలకు పైన పాజిటివ్ కేసులు, 100కి పైన మరణాలు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 106 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే 17 మంది కరోనాకు బలయ్యారు. నెల్లూరు, విశాఖ జిల్లాల్లో 11 మంది చొప్పున మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 9,686కి చేరింది.

తాజాగా 1,01,330 కరోనా పరీక్షలు నిర్వహించగా 23,160 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పుగోదావరిలో అత్యధికంగా 3,528 కొత్త కేసులు నమోదయ్యాయి. చిత్తూరు జిల్లాలో 2,670 కేసులు, అనంతపురం జిల్లాలో 2,334 కేసులు, విశాఖ జిల్లాలో 2,007 కేసులు గుర్తించారు. ఒక్క విజయనగరం జిల్లా (945) మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ 1000కి పైన పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో 24,819 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా...
ఏపీలో ఇప్పటివరకు 14,98,532 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 12,79,110 మంది కరోనా బారి నుంచి బయటపడ్డారు. ఇంకా 2,09,736 మంది చికిత్స పొందుతున్నారు.


More Telugu News