కరోనాకు బలైన బాలల సంక్షేమ కార్యకర్త రేణుక!
- రెండు దశాబ్దాలుగా బాలల సంక్షేమం కోసం కృషి
- తన ఆర్గనైజేషన్‌లో 1300 మంది బాలికలు
- గత నెల 20న సంక్రమించిన వైరస్
- లింగ వివక్షపై పలు పుస్తకాలు
బాలల సంక్షేమం కోసం రెండు దశాబ్దాలుగా అవిరళ కృషి చేస్తున్న రేణుక గుప్తా (56) కరోనా బారినపడి కన్నుమూశారు. పలు ఎన్జీవోలు, సంక్షేమ సంఘాలతో కలిసి పనిచేసిన ఆమెకు భర్త ఇందు ప్రకాశ్ సింగ్, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ప్రకాశ్ సింగ్ కూడా సామాజిక కార్యకర్తే. రేణుక గత నెల 20న కరోనా బారినపడ్డారు. ఆ తర్వాత రెండు రోజులకే నోయిడాలోని ఓ ఆసుపత్రిలో చేరిన రేణక అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం తుదిశ్వాస విడిచారు.
రేణుక తన జీవితంలో సగానికిపైగా బాలల హక్కులు, అందరికీ విద్య మొదలైన వాటి కోసం కృషి చేశారు. లింగ వివక్షపై సొంతంగానూ, భర్తతో కలిసి పలు పుస్తకాలు రాశారు. కాగా, తాను బయోలాజికల్‌గా ఇద్దరికే తల్లినని, కానీ తన పిల్లలు 1300 మందని రేణుక చెబుతుండేవారు. ఆమె ఆర్గనైజేషన్ పశ్చిమ యూపీలో 1300 బాలికల సంరక్షణను చూసుకుంటోంది.