జూన్ 15 నాటికి 5.86 కోట్ల టీకాలు సరఫరా చేస్తాం: కేంద్రం

  • దేశంలో వ్యాక్సినేషన్ వేగవంతానికి కేంద్రం చర్యలు
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మరిన్ని డోసులు
  • జూన్ నెలాఖరుకు మరో 4.87 కోట్ల డోసులు
  • ఉచితంగానే అందిస్తామన్న కేంద్రం
  • తగిన ప్రణాళిక రూపొందించుకోవాలన్న ఆరోగ్యమంత్రిత్వ శాఖ
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కేంద్రం వెల్లడించింది. మే 1 నుంచి జూన్ 15 మధ్యకాలంలో 5.86 కోట్ల వ్యాక్సిన్ డోసులను సరఫరా చేస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇస్తామని స్పష్టం చేసింది.

వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి అందిన సమాచారం మేరకు, జూన్ చివరి నాటికి మరో 4.87 కోట్ల డోసులు వస్తాయని భావిస్తున్నట్టు పేర్కొంది. వీటిని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నేరుగా సేకరించుకోవచ్చని తెలిపింది.

జిల్లాల వారీగా, కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ల (సీవీసీ) వారీగా తగిన ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. కొవిన్ పోర్టల్ ద్వారా వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ తదితర అంశాలపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని, తద్వారా వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నివారించాలని స్పష్టం చేసింది.


More Telugu News