ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద దంపతుల ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న సిబ్బంది
- ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు
- సీఎంను కలిసి గోడు వినిపించుకునేందుకు క్యాంపు కార్యాలయానికి
- చెక్‌పోస్టు సిబ్బంది అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం సమీపంలో కృష్ణా జిల్లాకు చెందిన భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. నరేశ్, సరస్వతి దంపతులు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయి ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకోవాలని అనుకున్నారు. ఇందుకోసం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు.
కరోనా నేపథ్యంలో ఇప్పుడు ముఖ్యమంత్రిని కలవడం కుదరదని పోలీసు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. వినతి పత్రం ఇస్తే దానిని సీఎంకు అందిస్తామని చెప్పారు. దీంతో వారిద్దరూ పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన చెక్‌పోస్టు సిబ్బంది వారిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. ఫిట్స్‌తో ఇబ్బంది పడిన బాధిత మహిళను తాడేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.