తనను, తన భార్యను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయన్న డుప్లెసిస్

  • 2011 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయిన దక్షిణాఫ్రికా
  • సమన్వయలోపంతో రనౌట్ అయిన డివిలియర్స్ 
  • మ్యాచ్ తర్వాత డుప్లెసిస్ పై విపరీతమైన ట్రోలింగ్
తాను తీవ్రమైన బెదిరింపులకు గురయ్యానని దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్ డుప్లెసిన్ తెలిపాడు. 2011 ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత టోర్నీ నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించినప్పుడు తనకు ఈ అనుభవం ఎదురైందని అన్నాడు.

ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. అయితే ఈ రనౌట్ కు కారణం నువ్వేనంటూ డుప్లెసిస్ కు బెదిరింపులు వచ్చాయి. తనతో పాటు, తన భార్యను కూడా చంపేస్తామని కొందరు వ్యక్తులు బెదిరించారని డుప్లెసిన్ చెప్పాడు. మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో తన మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగిందని తెలిపారు.

ఆనాటి మ్యాచ్ వివరాల్లోకి వెళ్తే... తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 221 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్ కు దిగిన సౌతాఫ్రికా 172 పరుగులకు ఆలౌట్ అయింది. ఒకానొక సమయంలో దక్షిణాఫ్రికా స్కోరు 4 వికెట్ల నష్టానికి 121 పరుగులుగా ఉంది. ఆ సమయంలో డుప్లెసిన్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే సమన్వయ లోపం వల్ల డివిలియర్స్ రనౌట్ అయ్యాడు. డుప్లెసిప్ 36 పరుగులు చేసినప్పటికీ తన జట్టును గట్టెక్కించలేకపోయాడు. ఆ మ్యాచ్ లో సౌతాఫ్రికా 49 పరుగుల తేడాతో ఓడిపోయింది.


More Telugu News