దేశంలో డిమాండ్‌కు తగ్గ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయాలి: గడ్కరీ
- మరిన్ని సంస్థలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది
- ఇందుకు చట్టం తేవాలని ప్రధానిని కోరతాను
- డిమాండ్ అధికంగా ఉంటే సమస్య తలెత్తుతుంది
- మిగులు టీకాలను ఎగుమతులు చేయవచ్చన్న గడ్కరీ
దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాల్సి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలోని పలు విశ్వ విద్యాలయాల ఉపకులపతులతో వర్చువల్ పద్ధతిలో గడ్కరీ మాట్లాడుతూ... దేశంలో వ్యాక్సిన్ డిమాండ్‌కు తగినట్టు దాని తయారీ కోసం మరిన్ని సంస్థలకు అనుమతించాల్సి ఉంటుందన్నారు.
ఈ మేరకు ప్రధాని మోదీకి తానో విజ్ఞప్తి చేయనున్నట్లు చెప్పారు. వ్యాక్సిన్ల పేటెంట్ హక్కుదారులకు 10 శాతం రాయల్టీ చెల్లించే విధంగా లైఫ్ సేవింగ్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేసేందుకు మరిన్ని కంపెనీలను అనుమతించేలా చట్టం తేవాలని కోరతానని తెలిపారు.
వ్యాక్సిన్ పంపిణీ కన్నా డిమాండ్ అధికంగా ఉంటే సమస్య తలెత్తుతుందని చెప్పారు. ఒకటికి బదులు మరో 10 కంపెనీలకు లెసెన్స్‌లు ఇచ్చి తయారీకి అనుమతించాలని తెలిపారు. మనం ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్‌లను దేశంలో సరఫరా చేసి, ఆ తర్వాత దేశంలో మిగులు టీకాలు ఉంటే ఎగుమతులు చేయవచ్చని చెప్పారు. భారత్‌లోని అన్ని జిల్లాలూ మెడికల్ ఆక్సిజన్ విషయంలో స్వయం సమృద్ధి సాధించాలని చెప్పారు.