చరణ్ సినిమాలో ఎమోషన్స్ కి పెద్దపీట!

చరణ్ సినిమాలో ఎమోషన్స్ కి పెద్దపీట!
  • చరణ్ 15వ సినిమాకి సన్నాహాలు  
  • ప్రాజెక్టు పనుల్లో నిమగ్నమైన శంకర్
  • దిల్ రాజుకి ఇది 50వ సినిమా
  • చిరూ బర్త్ డేకి మొదలెట్టాలనే ఆలోచన  
చరణ్ తాజా చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విడుదల కోసం మెగా అభిమానులంతా ఎదురుచూస్తుండగానే, శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టుపైనే శంకర్ కసరత్తు చేస్తున్నాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగవచ్చని అంటున్నారు.

సాధారణంగా శంకర్ సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి .. అలాగే ఎమోషన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ సినిమాలో కథాపరంగా ఎమోషన్స్ కి పెద్దపీట వేయడం జరిగిందని అంటున్నారు. ఇక చరణ్ తరహా ఫైట్లు .. డాన్సులు  మామూలే. ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో, మెగా అభిమానులు మరింత ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చరణ్ కి ఇది 15వ సినిమా కాగా, నిర్మాతగా దిల్ రాజూకి 50వ సినిమా కావడం విశేషం.


More Telugu News