ప్రముఖ తమిళ సినీ నటుడు విజయకాంత్ కు అస్వస్థత
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న విజయకాంత్
- చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స
- గత ఏడాది కరోనా బారిన పడిన విజయకాంత్
ప్రముఖ తమిళ సినీ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఈ ఉదయం ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయననను చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
గత ఏడాది ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్ నిర్ధారణ అయిందని అప్పట్లో ఆయన తెలిపారు. ఆ తర్వాత చికిత్స తీసుకుని ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. విజయకాంత్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు.