'పాగల్' రిలీజ్ పై క్లారిటీ ఇచ్చిన విష్వక్సేన్ 

  • విష్వక్సేన్ నుంచి రానున్న 'పాగల్'
  • ఓటీటీకి వెళ్లదని చెప్పిన హీరో
  • కథానాయికగా నివేదా పేతురాజ్
  • దర్శకుడిగా నరేశ్ కుప్పిలి పరిచయం
ఈ మధ్య దర్శక నిర్మాతలకు .. హీరోలకు కొత్త సమస్య మొదలైంది. ఫలానా సినిమా ఓటీటీలో వస్తుందటా అనే వార్త షికారు చేయడం, అందుకు ఆ సినిమా వాళ్లు స్పందిస్తూ అలాంటిదేం లేదని క్లారిటీ ఇవ్వడం. థియేటర్స్ మూతబడిన దగ్గర నుంచి ఈ సమస్య మరింత ఎక్కువవుతూ వస్తోంది .. ముఖ్యంగా చిన్న సినిమాల విషయంలో. అదే పరిస్థితి తాజాగా 'పాగల్' సినిమాకి ఎదురైంది. నరేశ్ కుప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, నివేదా పేతు రాజ్ కథానాయికగా నటించింది.

ఈ సినిమాను ఈ ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా వ్యాప్తి విపరీతంగా ఉండటంతో వాయిదా వేశారు. పరిస్థితులు అనుకూలించిన తరువాత కొత్త విడుదల తేదీని ప్రకటించాలని అనుకున్నారు. కానీ ఈ లోగానే .. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. రోజురోజుకూ ఈ ప్రచారం ఎక్కువవుతూ ఉండటంతో, స్వయంగా విష్వక్సేన్ రంగంలోకి దిగాడు. 'పాగల్' ఓటీటీకి వెళుతుందనే ప్రచారంలో నిజం లేదనీ, ఈ సినిమా థియేటర్లకే వస్తుందని స్పష్టం చేశాడు.



More Telugu News