జగన్ అనాలోచిత చర్యల వల్లే ఏపీలో కరోనా రెండో దశ విశ్వరూపం: అచ్చెన్నాయుడు
- ప్రధానికి లేఖలు రాస్తే సరిపోదు.. చర్యలు తీసుకోవాలి
- రాజకీయాలను పక్కనబెట్టి కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలి
- కరోనా కట్టడిని గాలికి వదిలేసిన జగన్
- ఏపీలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని నివాసంలో కూర్చొని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి సీఎం జగన్ లేఖలు రాస్తే ప్రయోజనం ఉండదని, కరోనా కట్టడికి సమర్థంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. రాజకీయాలను పక్కనబెట్టి కరోనా కట్టడిపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
జగన్ అనాలోచిత చర్యల వల్లే ఏపీలో కరోనా రెండో దశ విశ్వరూపాన్ని చూపిస్తోందని ఆయన విమర్శించారు. కరోనా కట్టడిని గాలికి వదిలేసిన జగన్.. ఏపీలో రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. అనంతపురంలో ఆక్సిజన్ అందక జిల్లా స్థాయి అధికారి కూడా మృతి చెందారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వ అసమర్థ చర్యల వల్లే వ్యాక్సినేషన్ ప్రక్రియ సరిగ్గా కొనసాగట్లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఆయన డిమాండ్ చేశారు.