కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు... సీఎం జగన్ నిర్ణయం
- ఏపీలో కరోనా మృత్యుఘంటికలు
- అనేక కుటుంబాల్లో విషాదం నింపుతున్న కరోనా
- తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా చిన్నారులు
- పిల్లల పేరిట రూ.10 లక్షలు ఫిక్స్ డ్ డిపాజిట్
- వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా కార్యాచరణ
కరోనా మహమ్మారి అనేక జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కరోనా బారినపడిన తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోతుంటే, వారి పిల్లలు అనాథల్లా మారుతున్నారు. ఒకే ఇంట్లో అత్యధిక సంఖ్యలో మరణాలు కరోనా కారణంగా సంభవిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.10 లక్షలు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు. ఆ మొత్తాన్ని పిల్లల పేరిట ఫిక్స్ డ్ డిపాజిట్ చేయనున్నారు. ఆ ఫిక్స్ డ్ డిపాజిట్ పై వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను నిర్దేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఏపీలో ఇప్పటివరకు 9 వేలకు పైగా కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. మహమ్మారి వైరస్ కారణంగా అనేక కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.