ప్రముఖ సినీ నటి సుధా చంద్రన్ కి పితృవియోగం
- సుధ తండ్రి కేడీ చంద్రన్ కన్నుమూత
- పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించిన కేడీ చంద్రన్
- మీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉందన్న సుధ
ప్రముఖ నాట్యకారిణి, తెలుగు సినీ పరిశ్రమలో 'మయూరి సుధ'గా పేరుగాంచిన సుధా చంద్రన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి కేడీ చంద్రన్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ నెల 12న ముంబైలోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఈరోజు గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
సుధా చంద్రన్ తండ్రి కూడా మంచి నటుడిగా గుర్తింపు పొందారు. ‘హమ్ హై రహీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే సప్నే’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘కోయీ మిల్ గయా’ తదితర చిత్రాల ద్వారా మంచి పేరు సంపాదించుకుంటున్నారు. అంతేకాదు, 'గుల్మొహర్' టీవీ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరించారు.
తన తండ్రి మృతి సందర్భంగా సుధా చంద్రన్ సోషల్ మీడియా ద్వారా ఉద్వేగభరితంగా స్పందించారు. 'మీ కూతురుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది నాన్నా' ఆని ఆమె అన్నారు. మీరు మాకు నేర్పించిన విలువలు, నియమాలను చివరి శ్వాస వరకు కొనసాగిస్తానని చెప్పారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో సుధ నటించారు. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తూ ఆమె బిజీగా ఉన్నారు. కేడీ చంద్రన్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.