నన్నూ అరెస్ట్ చేయండి: ఇద్దరు మంత్రుల అరెస్ట్ పై మమత ఆగ్రహం
- సీబీఐ ఆఫీసుకు వెళ్లిన బెంగాల్ సీఎం
- 45 నిమిషాల పాటు అక్కడే మమత
- ఆఫీసు బయట తృణమూల్ కార్యకర్తల ఆందోళన
నారదా కుంభకోణం కేసులో ఇద్దరు పశ్చిమ బెంగాల్ మంత్రులను అరెస్ట్ చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పద్ధతి అంటూ లేకుండా వారిని అరెస్ట్ చేశారంటూ ఆమె మండిపడ్డారు. తననూ సీబీఐ అరెస్ట్ చేయాలన్నారు. ఇద్దరు మంత్రులు ఫర్హద్ హకీం, సుబ్రతా ముఖర్జీలను సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
వారిని అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే ఆమె కోల్ కతాలోని సీబీఐ ఆఫీసుకు వెళ్లారు. దాదాపు 45 నిమిషాలు అక్కడే ఉన్నారు. కాగా, అరెస్ట్ లపై సీబీఐ ఆఫీసు ఎదుట తృణమూల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెద్దపెట్టున నినాదాలు చేశారు.