ఇద్దరు ఆవేశపరుల కథతో 'మహా సముద్రం'!

  • హీరోలుగా శర్వా - సిద్ధార్థ్
  • ఒకరిపై ఒకరికి గల ద్వేషంతో సాగే కథ
  • తమిళంలోను విడుదల చేసే ఆలోచన  
సాధారణంగా ఒక సినిమా హిట్ అయితే, ఆ వెంటనే మరో సినిమా చేయడానికి దర్శకులు ఉత్సాహం చూపుతారు. సాధ్యమైనంత త్వరగా ఎక్కువ సినిమాలను లైన్లో పెట్టడానికి ప్రయత్నిస్తారు. హీరోల క్రేజ్ కి తగిన కథలను రెడీ చేసుకోవడంలో నిమగ్నమవుతారు. కానీ 'ఆర్ ఎక్స్ 100' సినిమా హిట్ తరువాత, దర్శకుడు అజయ్ భూపతి అలా చేయలేదు. తాను ఒక కథను రెడీ చేసుకుని, ఆ కథకు సెట్ అయ్యే హీరోలను పట్టుకోవడానికి ఆయన చాలా సమయమే తీసుకున్నాడు. ఆ సినిమాయే .. 'మహాసముద్రం'.

శర్వానంద్ .. సిద్ధార్థ్ కథనాయకులుగా నటిస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం షూటింగు దశలో ఉంది. చిన్నప్పటి నుంచి ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకున్న ఇద్దరు ఆవేశపరుల కథ ఇది అని చెప్పుకుంటున్నారు. ఒకరిపై ఒకరికి గల ద్వేషాన్ని తీర్చుకోవడానికి వాళ్లు ఏం చేస్తారు? వాటి పర్యవసానాలు ఎలా ఉంటాయి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. అంతగా వాళ్ల మధ్య ద్వేషం పెరగడానికి కారణం ఏమిటనేదే సస్పెన్స్. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను, తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.


More Telugu News