కరోనా నుంచి కోలుకున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్‌ను కాటేసిన సైటోమెగలో వైరస్
- గత నెల 23న కరోనాతో ఆసుపత్రిలో చేరిన రాజీవ్
- కోలుకున్న తర్వాత ఇన్ఫెక్షన్
- సంతాపం తెలిసిన మోదీ, సోనియాగాంధీ సహా పలువురు నేతలు
కరోనాతో ఆసుపత్రిలో చేరి కోలుకున్న మహారాష్ట్ర కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు రాజీవ్ సాతవ్ నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. కరోనా పాజిటివ్‌గా తేలిన రాజీవ్ గత నెల 23న పూణెలోని జహంగీర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స అనంతరం కోలుకున్న రాజీవ్ సైటోమెగలో వైరస్ ఇన్ఫెక్షన్ బారినపడి మృతి చెందారు. రాహుల్ గాంధీకి రాజీవ్ సాతవ్ అత్యంత సన్నిహితుడిగా పేరుంది. ఏఐసీసీ కార్యదర్శిగా, కాంగ్రెస్ పార్టీ గుజరాత్ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2009-14 మధ్య యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగానూ సేవలు అందించారు.
రాజీవ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ, శరద్ పవార్, పలువురు శివసేన నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు విచారం వ్యక్తం చేశారు. పార్టీలో కీలక నేతను కోల్పోయామని సోనియాగాంధీ పేర్కొన్నారు.