ఓర్వకల్లు విమానాశ్రయం ఇక ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
- ఓర్వకల్లులో మార్చిలో ప్రారంభమైన విమానాశ్రయం
- జీవో జారీ చేసిన ప్రభుత్వం
- ఈ పేరు పెట్టబోతున్నట్టు అప్పట్లోనే చెప్పిన సీఎం
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో ఇటీవల ప్రారంభమైన విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఇప్పటికే దీని పేరును ఖరారు చేసినప్పటికీ నిన్న ప్రభుత్వం అధికారికంగా జీవో జారీ చేసింది. కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ వారితో పోరాడిన యోధుడు. దీంతో జిల్లాలో నిర్మించిన ఈ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టారు. ఈ విమానాశ్రయాన్ని రెండు నెలల క్రితం అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దీనిని ప్రారంభించారు.