ఆయుష్మాన్‌ భారత్‌ విషయంలో మాట తప్పిన సీఎం కేసీఆర్‌: బండి సంజయ్‌

  • గవర్నర్‌కు లేఖ రాసిన సంజయ్‌
  • కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని విజ్ఞప్తి
  • కార్పొరేట్‌ వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన
  • ఆయుష్మాన్ భారత్‌ అమలుకు కేసీఆర్‌ హామీ ఇచ్చారంటున్న సంజయ్‌
  • ఇప్పుడు మాట తప్పారని విమర్శ
కరోనా మహమ్మారిని నియంత్రించడంలో తెరాస ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఆయుష్మాన్‌ భారత్‌’లో కరోనా చికిత్సను చేర్చినట్లుగా రాష్ట్రంలో ఆరోగ్యశ్రీలోనూ చేర్చాలని డిమాండ్‌ చేశారు. ఆ దిశగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్‌ తమిళిసైని కోరారు.

కరోనా బారిన పడ్డ పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గవర్నర్‌కు బండి సంజయ్ తెలియజేశారు. ఈ మేరకు ఈ-మెయిల్ ద్వారా ఆమెకు లేఖను పంపారు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో పేదలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఖరీదైన చికిత్స కోసం ఆస్తులు అమ్ముకుని అప్పుల్లో కూరుకుపోతున్నారన్నారు. తెలంగాణలో 'ఆయుష్మాన్ భారత్'ను అమలు చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌ మాట తప్పారని విమర్శించారు.


More Telugu News