రఘురామకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందంటూ గవర్నర్ కు చంద్రబాబు లేఖ
- రఘురామ వ్యవహారంలో చంద్రబాబు స్పందన
- ఎంపీ ప్రాణాలు కాపాడాలని గవర్నర్ కు విజ్ఞప్తి
- ప్రాణహాని ఉంది కాబట్టే వై కేటగిరీ భద్రత కల్పించారని వెల్లడి
- ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని విమర్శలు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్ట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. తాజా పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణరాజుకు ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని చంద్రబాబు గవర్నర్ కు లేఖ రాశారు. ఎంపీ ప్రాణాలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతున్నానంటూ లేఖలో విజ్ఞప్తి చేశారు.
తనకు ప్రాణహాని ఉందని రఘురామ గతంలోనే చెప్పారని చంద్రబాబు వెల్లడించారు. ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయం గుర్తించే కేంద్ర ప్రభుత్వం వై-కేటగిరీ భద్రత కల్పించిందని తెలిపారు. ప్రభుత్వ దుశ్చర్యలపై గళం వినిపించినందుకే అక్రమ కేసులు, అరెస్టులకు పాల్పడుతున్నారని విమర్శించారు.