హర్యానా రైతులపై పోలీసుల లాఠీ చార్జీ

  • కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన హర్యానా సీఎం
  • సాగు చట్టాలు రద్దు చేయాలంటూ ఘెరావ్ చేసిన రైతులు
  • పోలీస్ బారికేడ్లను లాగిపారేసిన వైనం
  • బాష్పవాయు గోళాలు ప్రయోగించిన పోలీసులు
కొవిడ్ ఆసుపత్రిని ప్రారంభించేందుకు వెళ్లిన హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను రైతులు ఘెరావ్ చేశారు. ఈ ఘటన హర్యానాలోని హన్సిలో ఆదివారం జరిగింది. వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్ తో ఆయన్ను చుట్టుముట్టారు.

దీంతో రైతులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో రైతులు రెచ్చిపోయి పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను లాగిపారేశారు. దీంతో రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడ్డారు.

సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని సింఘూ, టిక్రి, ఘాజీపూర్ సరిహద్దుల వద్ద పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళనను విరమించాలని కేంద్రం విజ్ఞప్తి చేసినా వారు వినిపించుకోలేదు.


More Telugu News