అయ్యా .. కేసీఆర్ సారు.. ఇప్పటికే జనం తిరగ పడుతున్నరు: ష‌ర్మిల‌

  • కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చేది ఇంకెప్పుడు
  • ఆలోచిస్తాం అని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయింది
  • పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా?
  • కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేదెప్పుడు అంటూ ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నాన్ని పోస్ట్ చేసిన వైఎస్ ష‌ర్మిల తెలంగాణ స‌ర్కారుపై మండిప‌డ్డారు. 'కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఆలోచిస్తాం అని చెప్పి ఎనిమిది నెలలు గడిచిపోయింది, కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చేది ఇంకెప్పుడు కేసీఆర్‌ సారు? చచ్చే వారు పేదలు కాదనా? లేక పేదలు చచ్చినా ఎవరు అడిగేవారు ఉండరనే ధైర్యమా?  లేక ..  మీ లెక్కకు సరిపడ మరణాలు నమోదు కాలేదనా?' అని ష‌ర్మిల నిల‌దీశారు.

'అయ్యా.. కేసీఆర్ సారు.. ఇప్పటికే జనం తిరగ పడుతున్నరు, కరోనాతో రోడ్ల మీదపడ్డమని, బతుకులు ఆగమైనయని, జనం ఇంకా బర్బాద్ కాకముందే కరోనాను ఆరోగ్యశ్రీ లో చేర్చండి. ఇచ్చిన మాటను నిలబెట్టుకోండి. లేదంటే.. కరోనా సునామీలో కల్వకుంట్ల సామ్రాజ్యం కొట్టుకుపోవుడు ఖాయమే' అని ష‌ర్మిల‌ హెచ్చ‌రించారు.


More Telugu News