హైదరాబాద్ అమ్మాయికి రూ.2 కోట్ల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం
- హైదరాబాద్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న కూతురు దీప్తి
- అమెరికాలో చదువుకుంటోన్న విద్యార్థిని
- క్యాంపస్ ఇంటర్వ్యూలో ఎంపిక
- రేపటి నుంచి మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగం
ఓ హైదరాబాద్ అమ్మాయికి రూ.2 కోట్ల వార్షిక వేతనంతో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ వెంకన్న కూతురు నర్కుటి దీప్తి అమెరికాలో చదువుకుంటోంది. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడాలో ఇటీవలే ఆమె ఎంఎస్ పూర్తి చేసింది.
మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగానికి క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించగా ఆమె అందులో పాల్గొంది. ఆమె ప్రతిభ ఆ సంస్థ ప్రతినిధులకు నచ్చడంతో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో ఆమెకు ఆఫర్ ఇచ్చారు. దీప్తికి మైక్రోసాఫ్ట్ లో మాత్రమే కాదు.. గోల్డ్ మెన్ సాక్స్, అమెజాన్ కంపెనీల్లో ఉద్యోగాలకు కూడా ఎంపికైంది.
చివరకు ఆమె మైక్రోసాఫ్ట్ సంస్థలో చేరేందుకు సిద్ధమైంది. ఆమెను మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ గ్రేడ్–2 కేటగిరీలో ఉద్యోగానికి ఎంపిక చేశారు. రేపటి నుంచి మైక్రోసాఫ్ట్ ప్రధాన కార్యాలయంలో దీప్తి ఉద్యోగంలో చేరనున్నారు.