తౌతే తుపాను... కేరళ, తమిళనాడుకు తీవ్ర హెచ్చరికలు జారీ!
- క్రమంగా బలపడుతున్న తౌతే తుపాను
- కేరళ, తమిళనాడులకు ఆరెంజ్ బులెటిన్ జారీ
- వరద నీరు ప్రమాదకర స్థాయులకు చేరవచ్చని హెచ్చరిక
తౌతే తుపాను క్రమంగా బలపడుతోంది. ఐదు రాష్ట్రాలపై ఈ తుపాను ప్రభావాన్ని చూపబోతోంది. మరోవైపు, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు కేంద్ర జల సంఘం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తుపాను కారణంగా ఈ రెండు రాష్ట్రాలు తీవ్రమైన వరదలను ఎదుర్కొనే పరిస్థితి ఉండొచ్చని హెచ్చరించింది. రెండు రాష్ట్రాలకు ఆరెంజ్ బులెటిన్ ను జారీ చేసింది. వరదల వల్ల పలు ప్రాంతాల్లోని వరద నీటి మట్టం ప్రమాదకర స్థాయులకు చేరవచ్చని తెలిపింది.
మరోవైపు తుపాను బీభత్సాన్ని ఎదుర్కోవడానికి ఇప్పటికే గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాలు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు కొంకణ్ కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తాయని, బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
రాహుల్ గాంధీ కూడా తుపాను నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. కేరళ, మహారాష్ట్ర, గోవా, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలపై తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని... కాంగ్రెస్ శ్రేణులంతా బాధితులకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.