వైసీపీ మంత్రులు కరోనా పేరుతో దోచుకుంటున్నారు: టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి
- ఒక్కో జిల్లాను ఒక్కో మంత్రికి జగన్ అప్పగించారు
- వీరు ఆసుపత్రులను లీజుకు తీసుకుని దందాలు సాగిస్తున్నారు
- ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోంది?
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని నెల్లూరు జిల్లా టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. ఒక్కో జిల్లాను ఒక్కో మంత్రికి జగన్ అప్పగించారని... వారంతా కరోనా పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లాలో పొలిటికల్, మెడికల్ మాఫియా ఆగడాలు ఎక్కువయ్యాయని చెప్పారు. వైసీపీ నేతలు కొన్ని ఆసుపత్రులను లీజుకు తీసుకుని... ఎలాంటి అనుమతులు లేకుండానే కరోనా చికిత్సలు చేస్తున్నారని అన్నారు.
నెల్లూరు జిల్లా కలెక్టర్ కు ధైర్యం ఉంటే నెల్లూరులో నిర్వహిస్తున్న ఏడు ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించాలని కోటంరెడ్డి సవాల్ విసిరారు. వీళ్లంతా కరోనా పేషెంట్ల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని... ఇంత దారుణాలు జరగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తోందని ప్రశ్నించారు. పోలుబోయిన అశ్వినీ కుమార్ కరోనా బాధితులను దోచుకుంటున్నారని అన్నారు. ప్రతి రోజు రెండు కోట్ల రూపాయల మేర దోపిడీ జరుగుతోందని అన్నారు.