దేశంలో వ్యాక్సినేష‌న్‌పై పూర్తి వివ‌రాలు తెలిపిన కేంద్ర ప్ర‌భుత్వం

  • 60 ఏళ్లు పైబ‌డిన వారిలో 39.9 శాతం మందికి వ్యాక్సిన్లు పూర్తి
  • 45-60 ఏళ్ల మ‌ధ్య వారిలో 45.5 శాతం మందికి
  • తెలంగాణ‌లో 18-44 ఏళ్ల  వారిలో 500 మందికి
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అదే వ‌య‌సు వారిలో 2,624 మందికి టీకాలు
దేశంలో వ్యాక్సినేష‌న్‌పై కేంద్ర ప్ర‌భుత్వం పూర్తి వివ‌రాలు తెలిపింది. 60 ఏళ్లు పైబ‌డిన వారిలో 39.9 శాతం మందికి వ్యాక్సిన్లు వేసిన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. 45-60 ఏళ్ల మ‌ధ్య వారిలో 45.5 శాతం మంది వ్యాక్సిన్లు తీసుకున్న‌ట్లు చెప్పింది. 30-45 ఏళ్ల మ‌ధ్య వారిలో 9.4 శాతం మంది, 16-30 ఏళ్ల వారిలో 5.2 శాతం మందికి వ్యాక్సిన్లు ఇచ్చిన‌ట్లు వివ‌రించింది.

మొత్తానికి 18-44 ఏళ్ల వారిలో 42 ల‌క్ష‌ల మందికి పైగా టీకాలు వేసిన‌ట్లు తెలిపింది. అలాగే, గ‌త 24 గంట‌ల్లో 18-44 ఏళ్ల వారిలో 3.28 ల‌క్ష‌ల మందికి టీకాలు వేసిన‌ట్లు వివ‌రించింది. తెలంగాణ‌లో 18-44 ఏళ్ల  వారిలో 500 మందికి వ్యాక్సిన్లు వేసిన‌ట్లు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అదే వ‌య‌సు వారిలో 2,624 మందికి వేసిన‌ట్లు తెలిపింది.


More Telugu News