భారత్‌కు ఐదు కోట్ల డోసుల ఫైజర్ వ్యాక్సిన్ కోసం కొనసాగుతోన్న చర్చలు
- భారత్‌లో టీకాల కొరత
- టీకాల కొనుగోలు ఏర్పాట్లు చేసుకుంటోన్న రాష్ట్ర ప్రభుత్వాలు
- నేరుగా టీకాలను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లు
- ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి భారత్‌కు ఫైజర్
భారత్‌కు కొన్ని నెలల్లో అమెరికాలోని ఫైజర్ సంస్థ నుంచి ఐదు కోట్ల కరోనా వ్యాక్సిన్లు అందనున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం-ఫైజర్ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. భారత్‌లో స్పుత్నిక్-వీతో కలిపి ఇప్పటికే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ టీకాల కొరత విపరీతంగా ఉంది.
పలు రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా టీకాలను కొనుగోలు చేసేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫైజర్‌తోనూ చర్చలు కొనసాగుతుండడం గమనార్హం. అయితే, ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లను ఎగుమతి చేయడానికి ఇప్పటి వరకు అమెరికా అనుమతి ఇవ్వలేదు.
అయినప్పటికీ, ఒకవేళ భారత్‌కు ఫైజర్ వ్యాక్సిన్ ఉత్పత్తికి ఒప్పందం కుదిరితే ఐరోపా దేశాల్లో ఫైజర్ టీకాను ఉత్పత్తి చేస్తున్న సంస్థల నుంచే భారత్‌కు సరఫరా చేయాల్సి ఉంటుంది. భారత్‌లోని జనాభా మొత్తానికీ వ్యాక్సిన్లు అందించడానికి పెద్ద ఎత్తున విదేశాల నుంచి వ్యాక్సిన్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటివరకు భారత్‌లో వేసిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు దేశంలోనే ఉత్పత్తి అయ్యాయి. రష్యాలో ఉత్పత్తి అయిన స్పుత్నిక్-వీను తొలిసారి భారత్ దిగుమతి చేసుకుంది. విదేశాల్లో ఉత్పత్తి అయి భారత్ దిగుమతి చేసుకున్న తొలి టీకాగా స్పుత్నిక్-వీ నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి ఫైజర్ కూడా భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.