బీజేపీ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్‌పై శివసేన ప్రశంసల జల్లు.. అది గొప్ప కార్యక్రమమంటూ పొగడ్తలు!
- బీజేపీపై ప్రతిరోజు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న శివసేన
- తాజాగా తన వైఖరికి భిన్నంగా సామ్నాలో కథనం
- కరోనా వేళ మధ్యప్రదేశ్‌లో కార్యక్రమాలు అద్భుతమన్న శివసేన
- దేశంలోని అన్ని రాష్ట్రాలు వాటిని అమలు చేయాలని హితవు
బీజేపీపై ప్రతిరోజు ప్రతి విషయానికీ కారాలుమిరియాలు నూరే శివసేన పార్టీ తాజాగా తన వైఖరికి భిన్నంగా అధికారిక పత్రిక ‘సామ్నా’లో మధ్యప్రదేశ్ లోని బీజేపీ సర్కారుపై ప్రశంసల జల్లు కురిపించింది. కరోనా వేళ మధ్యప్రదేశ్ సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలు చేయాలని శివసేన పేర్కొనడం గమనార్హం.
కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతోన్న చిన్నారులకు ఉచిత విద్యతో పాటు నెలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహన్ ఇటీవల ప్రకటించారు. దీనిని ప్రస్తావిస్తూ, ఈ కార్యక్రమం ఎంతో అభినందనీయమని కొనియాడుతూ, ఉచిత విద్యతో పాటు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తామనడం ప్రశంసనీయమని పేర్కొంది.
మానవత్వంలో ఇదొక గొప్ప ముందడుగు అని శివసేన ప్రశంసించింది. అనాథ చిన్నారుల విషయంలో దేశానికి ఒక మార్గం చూపిందని పేర్కొంది. మహారాష్ట్రలోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపింది. అయితే, కరోనా వేళ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ను కొనసాగించాలని కేంద్ర సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నట్లు శివసేన తెలిపింది.