ఇండియా నుంచి స్వదేశానికి చేరుకున్న ఆస్ట్రేలియన్లు.. 72 మందికి అనుమతి నిరాకరణ!
- ముగిసిన ఇండియాపై ఆస్ట్రేలియా విధించిన ట్రావెల్ బ్యాన్
- సొంత గడ్డపై అడుగుపెట్టిన 70 మంది పౌరులు
- కరోనా వచ్చిన వారు ఢిల్లీలోనే ఆగిపోయిన వైనం
కరోనా నేపథ్యంలో ఇండియాపై ఆస్ట్రేలియా విధించిన ట్రావెల్ బ్యాన్ ముగిసిన సంగతి తెలిసిందే. దీంతో, 70 మంది ఆస్ట్రేలియా పౌరులు భారత్ నుంచి వారి స్వదేశంలో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి బయల్దేరిన విమానం ఈ ఉదయం ఆస్ట్రేలియాలోని డార్విన్ కు చేరుకుంది.
అయితే, టికెట్ బుక్ చేసుకున్న వారిలో 72 మందిని విమానంలోకి అనుమతించలేదు. వీరిలో 48 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా... మిగిలిన వారు కరోనా బాధితులతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారు కావడం గమనార్హం. వీరంతా నెగెటివ్ వచ్చేంత వరకు ఇండియాలోనే ఉంటారని ఆస్ట్రేలియా నార్తర్న్ టెర్రిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు వచ్చిన వారు రెండు వారాల పాటు క్వారంటైన్ లో ఉంటారని చెప్పారు. ఇండియాలో కనీసం 6 వేల మంది ఆస్ట్రేలియన్లు ఉంటారని ఒక అంచనా. ఇండియాలో కరోనా తీవ్రత నేపథ్యంలో వీరిలో చాలా మంది స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నారు.