ద్ర‌వ్య‌లోటు, అధిక అప్పులే జ‌గ‌న్ ఘ‌న‌త: య‌న‌మ‌ల‌

  • కరోనా వేళ స‌ర్కారు చేసిన ఖ‌ర్చులు, రాష్ట్ర ఆదాయం ఎంత‌?
  • దీనిపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలి
  • తిరోగ‌మ‌న వృద్ధి ఉంటుందన్న యనమల  
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ద్ర‌వ్య‌లోటు, అధిక అప్పులు చేయ‌డ‌మే ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్ ఘ‌న‌త అని టీడీపీ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు విమర్శించారు. రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, జ‌గ‌న్ పాల‌న‌పై ఆయ‌న మండిపడ్డారు. కరోనా వేళ స‌ర్కారు చేసిన ఖ‌ర్చుల‌తో పాటు రాష్ట్ర ఆదాయంపై శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాల‌ని ఆయ‌న‌ డిమాండ్ చేశారు.

క‌రోనా తొలి ద‌శ విజృంభ‌ణ స‌మ‌యంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధిరేటు 4.3 శాతానికి ప‌డిపోయింద‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు కూడా రాష్ట్రంలో తిరోగ‌మ‌న వృద్ధి ఉంటుంద‌ని తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ కంటే సీఎం జ‌గ‌న్ బాధ్య‌తారాహిత్య చ‌ర్య‌లే ప్ర‌జ‌ల‌కు చేటు చేస్తున్నాయ‌ని చెప్పారు. రాష్ట్ర‌ అభివృద్ధి జ‌ర‌గ‌ట్లేద‌ని, పేద‌లకు ఉపాధి దొర‌క‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. జ‌గ‌న్‌ తిరోగ‌మ‌న పాల‌కుడ‌ని ఆయ‌న అన్నారు.


More Telugu News