ఈ-పాస్ లేకుండా గోవా వెళుతున్న టీమిండియా క్రికెటర్ పృథ్వీ షాను ఆపేసిన పోలీసులు

  • విహారయాత్రకు గోవా వెళుతున్న పృథ్వీ షా
  • ముంబయి నుంచి పయనం
  • సింధుదుర్గ్ జిల్లాలో పృథ్వీ షాను ప్రశ్నించిన పోలీసులు
  • వెంటనే ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్న క్రికెటర్
దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాలు ప్రయాణ ఆంక్షలు విధించడం తెలిసిందే. ప్రయాణాలు చేసేవారు ఈ-పాస్ లు తప్పనిసరిగా కలిగి ఉండాలని పోలీసులు చెబుతున్నారు. అయితే, ఎలాంటి ఈ-పాస్ లేకుండా గోవా వెళ్లేందుకు ప్రయత్నించిన టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు చేదు అనుభవం ఎదురైంది. ముంబయి నుంచి గోవా వెళుతున్న పృథ్వీ షాను మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో పోలీసులు నిలువరించారు. పృథ్వీ షా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా కారులో ప్రయాణిస్తున్నట్టు గుర్తించారు.

ఆ తర్వాత పృథ్వీ షా అవసరమైన సమాచారం అందించి, ఈ-పాస్ టోకెన్ పొందడంతో పోలీసులు అతడిని గోవా వెళ్లేందుకు అనుమతించారు. ఇటీవల ఐపీఎల్ ఆగిపోవడంతో పృథ్వీ షా తన స్వస్థలం ముంబయి చేరుకున్నాడు. అయితే వేసవి విడిది కోసం గోవా వెళుతుండగా ఈ ఘటన జరిగింది.


More Telugu News