అమెజాన్ ప్రైమ్ కి వెళ్లిన 'ఖిలాడి'?
- 'క్రాక్' సినిమాతో లభించిన హిట్
- ముగింపు దశలో 'ఖిలాడి' పనులు
- రవితేజ ద్విపాత్రాభినయం
- అమెజాన్ ప్రైమ్ కి స్ట్రీమింగ్ హక్కులు
రవితేజ మాంఛి ఊపు మీద ఉన్నాడు.. ఆల్రెడీ ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో పెద్ద హిట్ ఇచ్చాడు. రవితేజ కెరియర్లోనే ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబట్టింది. ఆ తరువాత సినిమాగా రవితేజ 'ఖిలాడి' చేస్తున్నాడు. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈ నెల 28వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కుదరడం లేదు. అందువలన థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేసే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'అమెజాన్ ప్రైమ్' వారు సొంతం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడవలసి ఉంది. మరి థియేటర్ రిలీజ్ తరువాత ఈ సినిమా ఓటీటీలో వస్తుందా? లేదంటే నేరుగా ఓటీటీలోనే వస్తుందా? అనే విషయంలో స్పష్టత రావలసి ఉంది.
రవితేజ ఈ సినిమాలో రెండు విభిన్నమైన పాత్రలలో నటిస్తున్నాడు. ఆయన సరసన మీనాక్షి చౌదరి - డింపుల్ హయతి కథానాయికలుగా అలరించనున్నారు. ఈ ఇద్దరితోను ప్రేక్షకులకు గల పరిచయం చాలా తక్కువ. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథతో రూపొందుతున్న ఈ సినిమా, ఆయనకి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.