తడిసిముద్దయిన హైదరాబాద్... పలు ప్రాంతాల్లో వర్షం

  • అధిక వేడిమి నుంచి నగరజీవికి ఉపశమనం
  • ఓ మోస్తరు గాలులతో వర్షం
  • నేడు, రేపు వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ
  • గాలుల్లో అస్థిరతే కారణమని వెల్లడి
అధిక వేడిమి ఎదుర్కొంటున్న హైదరాబాదు నగరం ఈ సాయంత్రం వర్షంతో తడిసిముద్దయింది. నగరంలోని పలు ప్రాంతాల్లో గాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీ నగర్, తార్నాక, హయత్ నగర్, నాగోలు, వనస్థలిపురం, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.

మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా తమిళనాడులోని పలు ప్రాంతాల మీదుగా గాలుల్లో అస్థిరత వల్ల నేడు, రేపు కూడా తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నిన్న కూడా తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది.


More Telugu News