తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసుల కలకలం!
- భైంసాలో మూడు కేసులు
- ఒకరి మరణం, మరో ఇద్దరి పరిస్థితి విషమం
- గాంధీలోనూ మూడు కేసులు
- కొవిడ్ సోకిన అందరికీ బ్లాక్ ఫంగస్ రాదు
- వెల్లడించిన డీఎంఈ రమేశ్ రెడ్డి
తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. నిర్మల్ జిల్లాలోని భైంసాలో ముగ్గురు ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో ఒకరు చనిపోయారు. దీంతో ఆ జిల్లాల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు.
ఈ విషయంపై తెలంగాణ వైద్య విద్య విభాగం డైరెక్టర్ రమేశ్ రెడ్డి స్పందించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ కేసులు ప్రైవేట్ ఆసుపత్రి నుంచి వచ్చాయన్నారు. బ్లాక్ ఫంగస్ కేసులను ప్రైవేటు ఆసుపత్రుల వారు గాంధీకి పంపేందుకు యోచిస్తున్నారని తెలిపారు. కొవిడ్ సోకిన ప్రతిఒక్కరికీ బ్లాక్ ఫంగస్ సోకదని స్పష్టం చేశారు. కొందరు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారన్నారు.